.

Teachers Latest Information

Thursday, February 26, 2015

How to get Birth and Death Certificate easy Method


                జనన,మరణ దృవీకరణ పత్రం పొందండిలా.. జనన, మరణాల నమోదును ఏ మాత్రం ఆలస్యం చేసినా అది భవిష్యత్తులో పెద్ద సమస్యగా పరిణమించవచ్చు. ధ్రువీకరణ పత్రాన్ని తీసుకోవడం ఓ బాధ్యతగా భావించాలి. జనన, మరణ ధ్రువీకరణలను సకాలంలో నమోదు చేయకుంటే, వాటి అవసరం వచ్చినప్పుడు ఆయా పత్రాలను పొందడానికి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. చిన్నారులను బడిలో చేర్చేటప్పుడు పుట్టిన తేదీని ధ్రువీకరిస్తూ అధికారికంగా ఇచ్చిన పత్రాలను మాత్రమే అంగీకరించే విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జనన ధ్రువీకరణ ఎలా తీసుకోవాలి...? ఎన్ని రోజుల్లోపు దరఖాస్తు చేసుకోవాలి...? ఆలస్యమైతే ఎవరిని సంప్రదించాలి...? వంటి వివరాలపై మిత్రులకు ప్రత్యేకంగా అందిస్తున్న సమాచారం. శిశువు జన్మించిన 21 రోజుల్లోపే.... శిశువు జన్మించిన నాటి నుంచి 21 రోజుల్లోపు జనన ధ్రువీకరణ పత్రం కోసం దరఖాస్తు చేసుకోవాలి. గ్రామాల్లో అయితే పంచాయతీ కార్యాలయంలో, పట్టణాల్లో అయితే పురపాలక సంఘం కార్యాలయం లేదా నగర పంచాయతీ కార్యాలయంలో నమోదు చేయించాలి. ఇందుకోసం రెండు విధాలుగా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటి దగ్గర ప్రసవం జరిగితే ఆ విషయాన్ని పొందుపరుస్తూ సంబంధిత అధికారులకు దరఖాస్తు చేసుకోవాలి. ఆస్పత్రుల్లో ప్రసవం జరిగితే అక్కడ ఓ ధ్రువీకరణ పత్రాన్ని ఇస్తారు. దానిని తీసుకుని దరఖాస్తుకు జతచేయాలి. ఏడాది తరువాత ధ్రువీకరణ పత్రం కోసం తహసీల్దార్ కార్యాలయం నుంచి పొందాల్సి ఉంటుంది. పుట్టిన తేదీ నమోదై ఉంటే గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శి, మున్సిపాలిటీల్లో కమిషనర్ ధ్రువీకరణ పత్రాలను జారీ చేస్తారు. ఏడాది దాటితే ఇబ్బందే... శిశువు పుట్టిన 21 రోజుల్లో జననాన్ని నమోదు చేయిస్తే ధ్రువీకరణ పత్రం తీసుకోవడం చాలా సులువు. పంచాయతీ కార్యాలయాల్లో , మున్సిపల్ కార్యాలయాల్లో శిశువు జన్మించిన తేదీకి సంబంధించిన రికార్డులు అందుబాటులో ఉంటే ఎప్పుడైనా సులభంగా పొందొచ్చు. ఏడాది దాటిన తరువాత ధ్రువీకరణ నమోదు చేయాల్సి వస్తే ఆర్డీవోకు దరఖాస్తు చేసుకోవాలి. అందువల్ల తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకుని జనన తేదీలను సకాలంలో నమోదయ్యేలా చూడాలి. జారీ ఇలా... ధ్రువీకరణ పత్రం కోసం మొదట మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలి. రిజిష్టర్లో జనన నమోదు వివరాలు లేకపోతే పంచాయతీల్లో అయితే కార్యదర్శి, మున్సిపాలిటీల్లో అయితే కమిషనర్ నాన్ అవలెబుల్ పత్రాన్ని జారీ చేస్తారు. దానిని తీసుకుని ఓ వినతి పత్రాన్ని రాసి , రేషన్ కార్డు, ఆధార్కార్డు, పాఠశాల టీసీ, జిరాక్స్, అఫిడవిట్తో మీ సేవలో దరఖాస్తు చేసుకోవాలి. ఆ దరఖాస్తును ఆన్లైన్ ద్వారా సంబంధిత అధికారులకు పంపిస్తారు. వీఆర్వో, ఆర్ఐ, తహసీల్దార్ విచారణ చేస్తారు. అనంతరం ప్రొసీడింగ్ జారీ చేస్తారు. ఈ ప్రొసీడింగ్ రెండు విధాలుగా పని చేస్తుంది. గ్రామాల్లో జారీ చేసే ప్రొసీడింగే ఆయా దరఖాస్తుదారులకు జనన ధ్రువీకరణ పత్రంగా పనికి వస్తుంది. కానీ మున్సిపాల్టీల్లో మాత్రం తిరిగి ప్రొసీడింగ్తో కమిషనర్కు దరఖాస్తు చేసుకోవాలి. అప్పుడు వాటన్నింటినీ పరిశీలించి జారీ చేసిన ధ్రువపత్రమే పట్టణ ప్రాంత దరఖాస్తులకు జనన ధ్రువీకరణ పత్రంగా పనికొస్తుంది. పేరు పెట్టకున్నా.... శిశువు పుట్టిన తరువాత పేరు పెట్టలేదు కదా...ఎలా నమోదు చేయాలని అనుమానిస్తూ చాలా మంది ఊరుకుంటారు. శిశువు పేరు పెట్టకున్నా రిజిష్టర్లో నమోదు చేసుకునే ఆవకాశం ఉంది. ఆస్పత్రుల్లో ఇచ్చే రశీదుతో లేదా ఇంటి దగ్గర ప్రసవమైనట్లు స్వయంగా దరఖాస్తు రాసి జననాన్ని నమోదు చేసుకోవచ్చు. నమోదులో తల్లిదండ్రుల పేర్లు, పూర్తి చిరునామా ఉంటుంది. పాప, బాబు అని నమోదు చేస్తారు. పేరు పెట్టిన తరువాత తిరిగి అవే పత్రాలను తేదీ పేర్కొంటూ దరఖాస్తు చేసుకుంటే సులభంగా ధ్రువీకరణ పత్రాన్ని పొందవచ్చు. ఏడాది దాటిన తరువాత జనన ధ్రువీకరణాలు అందుకోవడానికి నాలుగు నెలల సమయం పడుతుంది. ప్రయోజనాలెన్నో.... * 1989 జనవరి 1 తరువాత పుట్టిన వారు పాస్పోర్టు పొందాలంటే జనన ధ్రువీకరణ పత్రాన్ని తప్పనిసరిగా జతచేయాల్సి ఉంటుంది.* పిల్లలను పాఠశాలల్లో చేర్పించాలన్నా తప్పనిసరిగా జనన ధ్రువీకరణ పత్రాన్ని దరఖాస్తుతో పాటు జతచేయాలి.* డ్రైవింగ్ లైసెన్స్కూ జనన నమోదు పత్రం తప్పనిసరి.* భవిష్యత్తులో అనేక అవసరాలకు ధ్రువీకరణ పత్రాలు ఉపయోగపడతాయి. జాగ్రత్తలు తీసుకోవాలి జనన తేదీల్లో అక్షర దోషాలు లేకుండా చూడాలి. సరైన చిరునామా రాయాలి. విద్యార్థుల విషయాల్లో దీనిని జాగ్రతగా గమనించాలి. టీసీలో ఒక విధంగా , జనన ధ్రువీకరణ పత్రంలో మరో విధంగా ఉంటే ఇబ్బందులు తప్పవు...సంజీవ్ మరణ ధ్రువీకరణ పత్రం ఇలా.... మరణ ధ్రువీకరణ పత్రాన్ని పొందడానికి 15 రోజుల సమయం పడుతుంది. వ్యక్తి మరణించిన 11వ రోజు గ్రామ పంచాయతీల్లో అయితే పంచాయతీ కార్యదర్శికి , మున్సిపాలిటీల్లో అయితే కమిషనర్కు దరఖాస్తు చేసుకోవాలి. దీనిని ధ్రువీకరించుకునేందుకు గాను వారు కొంత సమయం తీసుకుంటారు. చిరునామా ప్రకారం ఆయా కాలనీలకు వెళ్లి సిబ్బంది విచారణ చేసి, చుట్టుపక్కల వారితో సంతకాలు తీసుకుని కార్యాలయానికి నివేదిస్తారు. ఆ ప్రకారం ధ్రువీకరణ పత్రాన్ని జారీ చేస్తారు.